రసాభాసగా రామగుండం కౌన్సిల్ సమావేశం - సమస్యలపై బీఆర్ఎస్ కార్పొరేటర్ల రచ్చ - RAMAGUNDAM CORPORATION MEETING - RAMAGUNDAM CORPORATION MEETING
Published : Sep 11, 2024, 4:44 PM IST
BRS Councillors Protest In Ramagundam Council Meeting :పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసాగా మారింది. తమ డివిజన్ల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైన వెంటనే కార్పొరేటర్లు మేయర్ పోడియం ముందు నిరసకు దిగారు. కార్పొరేషన్లోని సమస్యలను పట్టించుకోవాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. కార్పొరేషన్లోని 50 డివిజన్లో చెత్తా చెదారంతో నిండిపోయిందన్నారు. రామగుండంలోని ప్రజా సమస్యలను మేయర్ పట్టించుకోవట్లేదని విమర్శించారు.
రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి వచ్చే విషపు నీళ్లను దారి మళ్లించాలని డిమాండ్ చేశారు. రామగుండంలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, కుక్కల బెడద సమస్యలను తీర్చాలంటూ కోరారు. అక్రమ నిర్మాణాలను తొలిగించాలని అన్నారు. విద్యుత్ జీరో బిల్లులను,గ్యాస్ సబ్సిడీ సమస్యలను పరిష్కరించాలంటూ 25 డివిజన్ కార్పొరేటర్ నగునూరి సుమలత ఫ్లకార్డుతో కౌన్సిల్ హాల్లో నిరసన తెలిపారు. రామగుండం కార్పొరేషన్ తీరు పేరు గొప్ప తీరుదిబ్బ అన్న చందంగా ఉందని కార్పొరేటర్ కౌశిక లత ఎద్దేవా చేశారు.