ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవ ఎన్నిక - Botsa Unanimously Elected as MLC
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 16, 2024, 8:13 PM IST
Botsa Satyanarayana Unanimously Elected in Visakha MLC Byelection : విశాఖపట్నం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బొత్సకు ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి అశోక్ అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం బొత్సతోపాటు పోటీపడిన స్వతంత్ర అభ్యర్థి షేక్ షఫీ పోటీగా నామినేషన్ వేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరంగా ఉండడంతో స్వతంత్ర అభ్యర్థి కాడా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయింది. రిటర్నింగ్ అధికారి అశోక్ నుంచి నియామక పత్రం పొందిన బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. శ్రావణ శుక్రవారం రోజున నాకు మంచి జరిగిందని ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని కొరుకుంటున్నట్లు తెలిపారు. ఈ విజయంలో తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఇక నుంచి ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు. అలానే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని బొత్స తెలిపారు.