ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అహంకారులకు ప్రజాస్వామ్యంలో చోటులేదు-జగన్,కేసీఆర్​లపై బొండా ఉమ విసుర్లు - Bonda uma press meet - BONDA UMA PRESS MEET

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 25, 2024, 8:29 PM IST

Bonda Uma Fire on YCP Government : ప్రస్తుత ఎన్నికల్లో జగన్ ఓడిపోవటం ఖాయమని విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ కూటమి అభ్యర్థి బొండా ఉమ అన్నారు. ఇక జూన్ నాలుగో తారీకే జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఉండే చివరిరోజు అవుతుంది విమర్శించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాయి వెలువడిన వెంటనే జగన్ రాష్ట్రం వదిలి వెళ్తారని తెలిపారు. చట్టాల్ని అతిక్రమించే వారికి, అహంకారులకు ప్రజాస్వామ్యంలో చోటులేదని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని జగన్ ఇప్పటికైన తెలుసుకోవాలని కోరారు. ఎన్నికల్లో జగన్‌ ఓడిపోగానే కేసీఆర్​లాగే జగన్ కూడా మాజీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

అలాగే గత ఐదేళ్లుగా పోలీస్ వ్యవస్థను వాడుకుని ప్రతిపక్షనేతలపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. సాక్ష్యత్తు చంద్రబాబు, పవన్ కళ్యాన్​ను ఏవిధంగా వేధించారో రాష్ట్ర ప్రజలందరికి తెలుసన్నారు. చివరికి ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వైసీపీ దౌర్జన్యాలు ఆపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ నేతల ఒత్తిళ్లకులోంగి ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బొండా ఉమ మండిపడ్డారు. 

ABOUT THE AUTHOR

...view details