లాబీయింగ్, లాలూచీల్లో జగన్ను మించినవారు లేరు : టీడీపీ నేత బొండా ఉమ - Bonda Uma press meet
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 6:47 PM IST
Bonda Uma Criticized CM Jagan : అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారనడానికి షర్మిల వ్యాఖ్యలే నిదర్శనమని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా అన్నారు. అవినీతి కేసుల్లో జగన్ జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం ఆయన భార్య భారతి, తన భర్త అనిల్ కుమార్ సోనియాను కలిశారన్న షర్మిల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. లాబీయింగ్, లాలూచీల్లో జగన్ను మించినవారు లేరని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తనపై తప్పుడు కేసులు పెట్టిందని, కేంద్రంలో అధికారంలో ఉండి తనను అన్యాయంగా జైలుకు పంపిందన్న జగన్ మాటలన్నీ పచ్చి అబద్ధాలని షర్మిల వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు.
Sharmila Comments on Jagan : అధికారంలో ఉంటే జగన్ ఎంతకైనా తెగిస్తాడు అనడానికి తల్లి, చెల్లి, బాబాయ్, కుటుంబంతో ప్రవర్తించిన తీరే నిదర్శనమని బోండా ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. వీటిపై సొంత చెల్లెలు షర్మిల కడపలో ప్రెస్ మీట్ పెట్టి మరీ నిజాలు వెల్లడించిందని తెలిపారు. వీటిపై జగన్ ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు.