ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాజధాని నిర్మాణానికి విరాళాల వెల్లువ- పింఛన్ డబ్బు అందించిన దివ్యాంగుడు - Youth Donated Pension to Amaravati - YOUTH DONATED PENSION TO AMARAVATI

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 5:39 PM IST

Updated : Jul 2, 2024, 6:58 PM IST

Blind Youth Donated Pension to Capital Amaravati: అమరావతి నిర్మాణానికి దివ్యాంగుడు ముందుకు వచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం దివ్యాంగుడు ముఖేష్ గౌడ్ తనకి వచ్చిన పెన్షన్​ సొమ్మును రాజధాని నిర్మాణానికి వినియోగించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడుకి అందజేశారు. పెన్షన్ పథకం ప్రారంభించేందుకు సోమవారం పెనుమాకకు వచ్చిన సీఎం చంద్రబాబుని దివ్యాంగుడు ముఖేష్ గౌడ్ కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగులకు నెలనెలా ఇచ్చే పెన్షన్ 6 వేల రూపాయలు చేశారు. మూడు నెలల బకాయి కలుపుకొని మొత్తం తొమ్మిది వేల రూపాయల పెన్షన్ సోమవారం అందుకున్నారు. 

పెనుమాకకు వచ్చిన సీఎం చంద్రబాబుని కలిసి, తనకి వచ్చిన పెన్షన్ డబ్బులను ఆయనకు అందజేశారు. గత ఐదేళ్లుగా రాజధాని నిర్మాణం జరగకపోవడంతో తన లాంటి యువకులు ఎంతోమందికి ఉపాధి లేకుండా పోయిందని ముఖేశ్ చెప్పారు. చంద్రబాబు హయాంలో రాజధానిని పూర్తిచేస్తే తమలాంటి వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అదే గ్రామానికి చెందిన పాలెపు సీతారావమ్మ తన కుమారుడు శివ ప్రసాద్ ఇచ్చిన 2 లక్షల రూపాయల చెక్కును చంద్రబాబుకు అందించారు. రాజధానిపై మమకారంతో అమెరికా నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని వెళ్లారని, ఆ సమయంలో రాజధాని నిర్మాణానికి తనవంతుగా రెండు లక్షల రూపాయల చెక్కును తల్లి సీతారావమ్మకు ఇచ్చి వెళ్లారు. ఆ చెక్కును సీతారావమ్మ సోమవారం గ్రామానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు అందించారు.

Last Updated : Jul 2, 2024, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details