ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు, ముగ్గురికి తీవ్రగాయాలు - Blast In Fireworks Center - BLAST IN FIREWORKS CENTER
Published : Apr 6, 2024, 8:04 PM IST
Blast In Fireworks Center : ఇంట్లో బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి అగ్నిప్రమాదం జరిగిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
స్థానికులు సమాచారం ప్రకారం
నల్గొండ జిల్లాలోని చిట్యాల సంతోష్ నగర్ కాలనీలో రామన్నపేటకు చెందిన మేకల యాదగిరి ఇంటిని గుంటూరుకు చెందిన కోటేశ్వర రావు అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఆ ఇంట్లో బాణాసంచాను కోటేశ్వరరావు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం బాణాసంచా తయారు చేస్తున్న క్రమంలో మందుగుండు పెద్ద శబ్ధంతో పేలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురుకి తీవ్రగాయాలు అయ్యాయి. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసం అయింది.
ఇంట్లో పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాయాలైన వారికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సంబంధిత వ్యక్తులు అనుమతి లేకుండా ఇంట్లో బాణాసంచా తయారు చేస్తున్నట్లుగా డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. అగ్నిప్రమాదాల నివారణకు అగ్నిమాపకశాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారు. సంతోష్ నగర్ కాలనీలో ఒక్కసారిగా బాణeసంచా పేలుడు సంభవించడంతో స్థానికంగా కలకలం రేపింది.