LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్ - BJP MP Laxman Live
Published : May 3, 2024, 10:14 AM IST
|Updated : May 3, 2024, 10:35 AM IST
BJP MP Laxman Live : పార్లమెంట్ ఎన్నికల్లో ఏ సర్వే చూసినా అన్ని బీజేపీ వైపే ఉన్నాయని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. త్వరలో కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యం కానుందని తెలిపారు. ప్రజలు తమ పార్టీని ఆదరించేందుకు సిద్దమయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దాదాపు 12 రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా గెలువలేని పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో నేల విడిచి సాము చేసినట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందన్నారు. దేశానికే కాదు ప్రపంచానికే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. మోదీ ముందు రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ఎవరూ కూడా సాటిరారని లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు లౌకిక వాదం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. సీఎం రేవంత్ రైతు రుణమాఫీ చేస్తామని దేవుడిపై ప్రమాణం చేస్తున్నారని, దేవుళ్లను రాజకీయాల్లోకి తీసుకొస్తుందని ఏ పార్టీనో ప్రజలు ఆలోచించాలని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన పరిస్థితే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వస్తుందని ఆయన జ్యోసం చెప్పారు. తాజాగా ఇవాళ హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ పాల్గొన్నారు.
Last Updated : May 3, 2024, 10:35 AM IST