తెలంగాణ

telangana

ETV Bharat / videos

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఎన్ని జిమిక్కులు చేసినా - బీజేపీ అభ్యర్థుల గెలుపు పక్కా : ఎంపీ లక్ష్మణ్ - BJP MP Laxman Election Campaign - BJP MP LAXMAN ELECTION CAMPAIGN

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 1:32 PM IST

BJP MP Laxman Election Campaign : రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు ఎన్ని జిమిక్కులు చేసినా బీజేపీ అభ్యర్థుల గెలుపు ఖాయమని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి కిషన్‌ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని అరుంధతి నగర్, వీవీగిరి నగర్, సబర్మతి నగర్, ఆంధ్ర కేఫ్ ప్రాంతాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించారు.

BJP MP Laxman Support Kishan Reddy : సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి కమలం గుర్తుకు ఓటు వేయాలని ఎంపీ లక్ష్మణ్‌ ఓటర్లను అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు వచ్చే వివిధ రాజకీయ పార్టీల నేతల మాటలను విని ప్రజలు మోసపోవద్దని హితవు పలికారు. ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి తమ పార్టీని ఆశీర్వదిస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details