LIVE : బీజేపీ సభ్యత్వ నమోదు కార్యశాలలో కిషన్ రెడ్డి - t BJP Membership Registration 2024 - T BJP MEMBERSHIP REGISTRATION 2024
Published : Aug 21, 2024, 12:24 PM IST
|Updated : Aug 21, 2024, 12:39 PM IST
Telangana BJP Membership Registration Programme : సికింద్రాబాద్లోని బీజేపీ సభ్యత్వ నమోదు మహోత్సవం కార్యశాల ప్రారంభం అయింది. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి నేతృత్వంలో కార్యశాల జరుగుతోంది. ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ కార్యదర్శి విజయ రాహత్కర్ హాజరయ్యారు. అలాగే కార్యశాలకు కేంద్రమంత్రి బండి సంజయ్, అభయ్ పాటిల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. కుటుంబ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని అన్నారు. బీజేపీ సిద్ధాంత పరంగా పని చేస్తోందని తెలిపారు. క్రమం తప్పకుండా సభ్యత్వాలు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యకర్తలు ఇష్టంతో సభ్యత్వాలు నమోదు చేయించాలని వివరించారు. దేశంలో అత్యధికంగా సభ్యతాలు ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పారు. పార్టీ బలపడాలి అంటే సభ్యత్వ నమోదు విజయవంతం కావాలని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కిషన్ రెడ్డి సూచించారు. రాజకీయాల్లో పోటీతత్వం ఉన్నా ప్రధానిగా మోదీ మూడోసారి గెలిచారని హర్షించారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Last Updated : Aug 21, 2024, 12:39 PM IST