ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పచ్చకామెర్లు ఉన్నోళ్లకు లోకం పచ్చగానే కనిపిస్తుంది- బొత్స కామెంట్స్​పై నిప్పులు చెరిగిన పురందేశ్వరి - Purandeswari fire on Botsa - PURANDESWARI FIRE ON BOTSA

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 4:40 PM IST

BJP Leader Purandeswari Fire on Botsa Styanarayana : మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఘాటుగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆయన చేసిన కామెంట్స్​ను తీవ్రంగా ఖండించారు. పచ్చకామెర్లు ఉన్న వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని విమర్శించారు. బొత్స చేసిన వోక్స్ వాగన్ స్కాంను ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తుచేశారు. విశాఖ రైల్వే జోన్​కు రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదని తెలిపారు. వంద కోట్ల పైగా కేంద్రం రైల్వేజోన్​కు నిధులు ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకోలేకపోయారని నిలదీశారు.

గత ఐదేళ్లుగా కేెంద్రం పెద్దమెుత్తంలో నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందించినా వాటిని సద్వినియోగం చేసుకోకుండా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. రైల్వే జోన్​తో పాటు, జల్ జీవన్ మిషన్, ప్రధాన మంత్రి ఆవాసయోజన, రోడ్ల నిర్మాణానికి సంబంధించి పెద్ద మెుత్తంలో నిధులు రాష్ట్రానికి మంజూరు చేసింది. అయినా  వైఎస్సార్సీపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని మండిపడ్డారు. పదేళ్లుగా మోదీ ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఎవ్వరు కూడా అవినీతి జరిగినట్లు నిరూపించలేక పోయారని తెలిపారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ పసలేని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని పురందేశ్వరి పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details