త్వరలో తల్లీ, పిల్ల కాంగ్రెస్ ఒక్కటవుతాయి: లంకా దినకర్ - lanka dinakar on ysrcp congress - LANKA DINAKAR ON YSRCP CONGRESS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 19, 2024, 10:29 PM IST
Lanka Dinakar on YSRCP Congress Merge: త్వరలో తల్లీ, పిల్ల కాంగ్రెస్‌లు ఒకటవుతాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. షర్మిల తన అన్న జగన్‌తో ఆస్తులు, పదవుల పంచాయితీ కారణంగానే రోడ్డెక్కిందని విమర్శించారు. ఆస్తి పంచాయతీ సర్దుబాటు చేసుకున్న తరువాత కాంగ్రెస్, వైఎస్సార్సీపీ కలిసిపోతాయన్నారు. కుటుంబ తగాదాలను ప్రజల బాధలుగా మార్చే షర్మిల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
నాడు వైఎస్ రాజశేఖర్ నుంచి నేడు వైఎస్ జగన్ వరకూ అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ దేవాలయాలకి వ్యతిరేకంగా ఉండే భావజాలంతోనే పనిచేశారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో టీటీడీలో మొదలైన దోపిడీ, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంకా ఎక్కువైందన్నారు. తన తండ్రి భావజాలంతోనే జగన్ కూడా పనిచేశారని మండిపడ్డారు. జగన్ టీటీడీని దోచుకున్నారని, వెంకటేశ్వరస్వామి నిధుల్ని అడ్డగోలుగా దోపిడీ చేశారని లంకా దినకర్ మండిపడ్డారు. హిందూ దేవాలయాలలో హిందువులను మాత్రమే ఉద్యోగాలలో నియమించడం ద్వారా ఇటువంటి అరాచకాలను కట్టడి చేయాలని కోరారు.