LIVE : ఈటల రాజేందర్ మీట్ ది ప్రెస్ - ప్రత్యక్షప్రసారం - Etela Rajender Meet the Press - ETELA RAJENDER MEET THE PRESS
Published : Apr 7, 2024, 12:09 PM IST
|Updated : Apr 7, 2024, 1:19 PM IST
BJP Leader Etela Rajender Meet the Press LIVE : రాష్ట్రంలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ నాయకులు రైతులను పట్టించుకోవట్లేదని బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ విమర్శించారు. హైదరాబాద్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై స్పందించిన ఆయన సీబీఐతో విచారణ చేపట్టాలని తెలిపారు. ఒక పార్టీలో గెలిచి, ఇతర పార్టీల్లో మంత్రి పదవులు అనుభవిస్తున్న వారిని రాళ్లతో కొట్టాలన్న రేవంత్ రెడ్డి, దానం నాగేందర్‌ను ఎలా పార్టీలోకి చేర్చుకున్నారని ప్రశ్నించారు.లోక్ సభ ఎన్నికల్లో దేశంలో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరిలో అన్ని సంఘాల మద్దతు బీజేపీకే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర పార్టీలకు డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. నిబద్ధత కలిగి ఉన్న నాయకులు, కార్యకర్తలు బీజేపీలో ఉన్నారని, అందరూ కలిసికట్టుగా ఉండి విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
Last Updated : Apr 7, 2024, 1:19 PM IST