ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'హామీలను విస్మరించిన భారతి సిమెంట్స్ యాజమాన్యం'- కొనసాగుతున్న ఉద్యోగుల ఆందోళన - BHARATHI CEMENT WORKERS - BHARATHI CEMENT WORKERS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 1, 2024, 3:41 PM IST

Bharathi Cement employees agitation programs:  వైయస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలం నల్లింగాయ పల్లె భారతి సిమెంట్ పరిశ్రమ సమీపంలో ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. గత మూడు రోజులుగా తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ పరిశ్రమలోని ఉద్యోగులు బ్యానర్లతో నిరసన తెలియజేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతంలో  పరిశ్రమ ఏర్పాటు చేసేటప్పుడు యాజమాన్యం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని ఉద్యోగులు ఆరోపించారు. తమకు ఇంక్రిమెంట్ల విషయంలో అన్యాయం జరుగుతుందని వెల్లడించారు.

మూడు సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్ ఇవ్వాలని, కానీ ప్రమోషన్ల ఊసేలేదని  కార్మికులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటు సమయంలో తమ వద్ద డిపాజిట్ చేసుకున్న సొమ్మును, తిరిగి  తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత నెల 30వ తేదీ సిమెంటు గేటు వద్ద కార్మికులంతా హక్కుల కోసం నిరసన తెలపడంతో, ఆరవ తేదీ లోపు సమస్యలు పరిష్కరిస్తామని యాజమాన్యం ప్రకటించింది. అయినప్పటికీ సమస్యలు పరిష్కరించేంతవరకు తాము విధుల్లోకి వెళ్ళకుండా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఉద్యోగులు పేర్కొన్నారు.  

ABOUT THE AUTHOR

...view details