తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా భారత్ బంద్ - రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు - BHARAT BANDH IN TELANGANA - BHARAT BANDH IN TELANGANA

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 1:55 PM IST

Bharat Bandh in Telangana Against SC ST Sub Classification : ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సంఘర్ష్ సమితి "రిజర్వేషన్ బచావో" పేరిట భారత్ బంద్​కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల నిరసన కొనసాగుతోంది. కొత్తగూడెం జిల్లా,  భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ వద్ద మాల మహానాడు నాయకులు నిరసన చేపట్టారు. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్​ పాఠశాలలను మూసివేయించారు. 

నల్గొండ జిల్లాలో దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. సిద్ధిపేట బస్ డిపో వద్ద ధర్నా నిర్వహించారు. డిపోల నుంచి బస్సులు రాకుండా అడ్డుకున్నారు. ఈ బంద్​తో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును సుప్రీం కోర్టు ఉపసంహరించుకోవాలని మాల మహానాడు నేతలు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా, బోధన్ డివిజన్ పరిధిలో నిరసనకారులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని మాలమహానాడు వ్యతిరేకిస్తోంది. 

ABOUT THE AUTHOR

...view details