ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విద్యార్థుల లేఖకు స్పందించిన మంత్రి - పాఠశాల సిబ్బందిపై చర్యలకు ఆదేశం - BC Welfare Minister Savitha - BC WELFARE MINISTER SAVITHA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 3, 2024, 3:44 PM IST

BC Welfare Minister Savitha Sudden Visit KGBV School in Satya Sai District : పాఠశాల నిర్వహణపై ఆలసత్వం వహించిన సిబ్బందిపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని పాపిరెడ్డి గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా  విద్యాలయ(కేజీబీవీ) సమస్యలపై విద్యార్థినులు స్వయంగా మంత్రికి లేఖలు రాశారు. దీనికి స్పందించిన మంత్రి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కేజీబీవీ పాఠశాల్లో విద్యార్థులకు అందించే ఆహారం నాసిరకంగా ఉందని సిబ్బందిపై మంత్రి సవిత మండిపడ్డారు. పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని విద్యార్థులు మంత్రికి విన్నవించుకున్నారని పేర్కొన్నారు. మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేక విద్యార్థినులు తీవ్ర సౌకర్యానికి గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీ పాఠశాల్లో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. విధి నిర్వహణల్లో ఆలసత్వం వహించిన పాఠశాల సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details