ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బాలకృష్ణ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన నారా బ్రాహ్మణి - Nara Brahmani election campaign - NARA BRAHMANI ELECTION CAMPAIGN

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 9:22 PM IST

Nara Brahmani election campaign in Hindupuram: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో బాలకృష్ణ కుటుంబసభ్యులు స్త్రీ శక్తి కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని మహిళలతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. మహిళా సాధికారత గురించి ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి  బాలకృష్ణ అని నారా బ్రాహ్మణి అన్నారు. హిందూపురాన్ని భారత దేశంలోనే ఒక మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేదే బాలకృష్ణ లక్ష్యమన్నారు. హిందూపురం మహిళల కోసం బాలకృష్ణ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని వారు గుర్తు చేశారు. నియోజకవర్గంలోని మహిళలతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ కార్యక్రల వివరాలను మహిళలకు తెలిపారు. హిందూపురం అభివృద్ధికి బాలకృష్ణ కట్టుబడి ఉంటారని నారా బ్రాహ్మణి తెలిపారు. తెలుగుదేశం మేని ఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేశారని గుర్తుచేశారు. ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు ప్రతి నెల 1500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, పిల్లల చదువు తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. బాలకృష్ణ సినిమా రంగం, రాజకీయ రంగం, సేవా రంగంలో విజయం సాధిస్తున్నారని తెలిపారు. బాలకృష్ణకు రాజకీయాలు మానుకోమని  అనేక మంది సలహాలు ఇస్తున్నారని, కానీ బాలకృష్ణ ప్రజా సేవ చేయడానికి ముందుకు వచ్చారని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details