యువకులకు ఓటు హక్కు కావాలంటే ఎన్నేళ్లు ఉండాలంటే ! - మంత్రిగారూ ఏం సెలవిచ్చారంటే ! - MINISTER COMMENTS ON VOTING AGE - MINISTER COMMENTS ON VOTING AGE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 7:30 PM IST
Minister Audimulapu Suresh Comments on Voting Age : దేశ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి కనీస వయస్సు ఎంత అంటే స్కూలుకు వెళ్లే చిన్న పిల్లాడిని అడిగిన ఠక్కున 18 సంవత్సరాలని చెెబుతాడు. కానీ రాష్ట్రంలోని సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేశ్ మాత్రం అబ్బాయిలకు 21 సంవత్సరాలకు, అమ్మాయిలకు 18 ఏళ్లకు ఓటు హక్కు వస్తుందని చెబుతున్నారు. ఈ మాటలు విన్న ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లాలోని కొండేపి నియోజకవర్గ ప్రజలు చాలా వరకు బతుకుతెరువు కోసం హైదరాబాదులో జీవిస్తున్నారు. అయితే ఐదేళ్లలో మంత్రి సురేశ్‌కు గుర్తుకురాని వీరు ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో గుర్తుకు వచ్చారు.
ఓట్ల కోసం వారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రి నేరుగా హైదరాబాదుకు వెళ్లి వారితో సమావేెశం ఏర్పాటు చేశారు. అయితే అక్కడ మంత్రి సురేశ్ చెప్పిన ఓటు హక్కు వయస్సు విన్న వారు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఓటు హక్కు వయస్సు తప్పుగా చెప్తూ ప్రసంగించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అయితే వ్యక్తి యొక్క కులం, మతం, సామాజిక లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు ఉన్న భారతీయ పౌరులందరికీ ఓటు హక్కును భారత రాజ్యాంగం కల్పించిన విషయం తెలిసిందే.