మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్‌ని వేజ్ బోర్డులోకి తీసుకొచ్చి కనీస వేతనం చెల్లించాలి: ఏపీఎంఎస్ఆర్యూ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2024, 8:48 PM IST
APMSRU Demands Lift GST on Medicines and Medical Devices : మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీ ఎత్తివేయాలని ఏపీ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (AP Medical Sales Representatives Union) నాయకులు డిమాండ్ చేశారు. మందుల ధరలు తగ్గించి నకిలీ, కల్తీ, నాసిరకం మందులకు అరికట్టాలని కోరారు. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్‌ని వేజ్ బోర్డు పరిధిలోకి తీసుకొచ్చి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య రంగానికి జీడీపీలో కనీసం 6 శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 7వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో జరిగే ధర్నా కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాది మంది మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ వస్తారని ఆ సంఘం నాయకులు తెలిపారు.