ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'అనర్హత' వేటుపై స్పీకర్ స్పందన - 8మంది ఎమ్మెల్యేలకు నోటీసులు - ఏపీ రాజకీయాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 10:40 AM IST

AP Speaker Tammineni Sitaram Issued Notices To MLAs : పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు అనర్హత వేటు వేయాలని 8 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులపై శాసనసభాపతి తమ్మినేని సీతారాం స్పందించారు. రాత పూర్వక స్పందన కోసం ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. అయితే దానికి వారు స్పందించారా లేదా తదుపరి చర్యలు ఏం తీసుకోబుతున్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

గత సంవత్సరం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి ఓటు వేశారని తర్వాత కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్సార్సీపీ ఈ నెల 8న స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, మద్దాలి గిరిధర్ టీడీపీ తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికై అనంతరం వైఎస్సార్సీపీ పంచన చేరడంతో పాటు ఇప్పుడు ఆ పార్టీ తరపునే పని చేస్తున్నారని వారిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఫిర్యాదు చేసింది.

ABOUT THE AUTHOR

...view details