గంగవరం పోర్టు ఉద్యోగులను ముంచారు- పోర్టులో ప్రభుత్వ వాటాను వెనక్కి తీసుకోవాల్సిందే: నేతి మహేశ్వరరావు - Neti Maheswara Rao - NETI MAHESWARA RAO
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 6:49 PM IST
AP Professional Forum President Neti Maheswara Rao Comment Gangavaram Port : గంగవరం పోర్టు ఉద్యోగులు, నిర్వాహితులను సీఎం జగన్ మోహన్ రెడ్డి నిండా ముంచారని రాష్ట్ర ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఉద్యోగులను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరవాత గంగవరం పోర్టులో ఉన్న ప్రభుత్వ వాటాను కూడా అదానీ సంస్థకు కట్టబెట్టారని ఆరోపించారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను వెనక్కి తీసుకునే వరకు ఉద్యోగులకు ఉంటామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
గంగవరం పోర్టులో ఉన్న ప్రభుత్వ వాటాను అదానీ కంపెనీకి కట్టబెట్టే సమయంలో ఉద్యోగులు, నిర్వాహితుల సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కూడా సీఎం జగన్కు లేదని నేత మహేశ్వరరావు మండిపడ్డారు. అక్కడ అదానీ సంస్థ వారు ప్రైవేటు సైనికులను ఏర్పాటు చేసుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. గంగవరం పోర్టు సమీపంలో అంతా జరుగుతున్న అధికారం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్ర రాజకీయాలను అదానీ శాసిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అదానీప్రదేశ్గా మార్చరని పేర్కొన్నారు.