తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : ప్రజల ఆస్తులపై వైసీపీ పడగనీడ - ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ పర్యవసానాలేంటి? స్పెషల్ డిబేట్ - Debate on AP Land Titling Act 2023 - DEBATE ON AP LAND TITLING ACT 2023

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 9:15 AM IST

Updated : May 5, 2024, 11:30 AM IST

Debate on AP Land Titling Act 2023 : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర దాకా వైసీపీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. ప్రైవేటు భూమా, ప్రభుత్వ భూమా అనే వివక్ష జగన్ పార్టీ వాళ్లకి లేదు. కన్నుపడితే చాలు ఖర్చీఫ్ వేసేయటమే వారికి తెలిసింది. ఈసారి దాన్ని మరింత విస్తృతం చేయటం కోసం జగన్ సర్కార్ భూ యాజమాన్య హక్కుల చట్టం (ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్) అనేది కొత్తగా తెచ్చింది. అది కనుక అమల్లోకి వచ్చిందంటే జనం ఆస్తులు గోవిందా అనే భయం ప్రజల్లో వచ్చేసింది. అడ్డూ అదుపు లేని భూదోపిడీకి తెరతీసేలా జగన్ ప్రభుత్వం ఆ చట్టాన్ని రూపొందించింది. అందులోని ప్రమాదకర అంశాలేంటి? వైసీపీ సర్కార్ దాన్ని అమలు చేస్తే జరిగే పర్యవసానాలేంటి? అనే అంశంపై ఈటీవీ ఆంధప్రదేశ్‌ ప్రత్యేక డిబేట్ చేపట్టింది. ఆ చట్టంపై అవగాహన ఉన్న ప్రముఖులు లైవ్‌లో అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 
Last Updated : May 5, 2024, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details