ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: ఇంటర్ ఫలితాల విడుదల- ప్రత్యక్షప్రసారం - AP Inter 2024 Results - AP INTER 2024 RESULTS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 11:02 AM IST

Updated : Apr 12, 2024, 11:34 AM IST

AP Intermediate Results Release Live: ఇంటర్మీడియట్​ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్​ విద్యామండలి ఫలితాలను విడుదల చేసింది. తాడేపల్లిలోని ఇంటర్​ బోర్డు కార్యదర్శి ఇంటర్​ పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ఇవ్వనున్నట్లు ఇంటర్​ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ ఏడాది రెగ్యులర్​, ఒకేషనల్​ విద్యార్థులు కలిపి మొదటి, రెండవ సంవత్సరానికి గాను దాదాపు 10 లక్షల మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన ఇంటర్​ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్​ పరీక్షల ఫలితాలను www.bie.ap.gov.in అధికార వైబ్​సైట్​ ద్వారా తెలుసుకోవచ్చు. వేగవంతమైన ఫలితాల కోసం www.eenadu.net, www.etvbharat.com ను సందర్శించండి. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని ఇంటర్మీడియట్​ బోర్డు కార్యాలయంలో ఫలితాల విడుదల ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Apr 12, 2024, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details