యోగా మనకోసం- ఆరోగ్యకరమైన మన సమాజం కోసం : గవర్నర్ - Governor in Yoga day celebrations - GOVERNOR IN YOGA DAY CELEBRATIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 21, 2024, 12:26 PM IST
Governor Abdul Nazeer in International Day of Yoga celebrations at RajBhavan : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, ఇది శ్వాస వ్యాయామాలతో కూడుకుని ఉంటుందని, మనలో ఉన్న ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి, నిరాశ, నిస్పృహల నుంచి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని యోగా గురువులు పేర్కొన్నారన్నారు.
ఏటా జూన్ 21వ తేదీన గత పదేళ్లుగా అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) నిర్వహిస్తూ యోగకు మరింత ప్రాచుర్యం కల్పిస్తుండడం అభినందనీయమని వారు అన్నారు. యోగా మన కోసం, ఆరోగ్యకరమైన మన సమాజం కోసం అనే లక్ష్యంగా అంతా యోగ సాధన చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.