Namburu Woman Murder Case : ఆ మహిళ అతని భార్య కాదు! కానీ తనకే ఆమె సొంతం కావాలనుకున్నాడు. ఆ మహిళ మాత్రం వివాహేతర సంబంధాన్ని మధ్యలో తెంచేసుకుంది. దీంతో అతడు తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా వశపరుచుకోవాలనుకున్నాడు. చివరకు భూత వైద్యుడికి రూ.3 లక్షల సుపారీ ఇచ్చి వశీకరణం చేయించాడు. అయినా వాళ్ల పాచికలు పారలేదు. చివరకు ఆమెను అంతమొందించాడు. కటకటాలపాలయ్యాడు.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో గత నెల 28న మల్లిక అనే మహిళ హత్యకు గురైంది. మెడపై గాయం ఉండడంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. తీగలాగితే పోలీసులే విస్తుపోయే క్రైం కథ బయటికొచ్చింది. మల్లికకు నంబూరుకు చెందిన అక్బర్‌తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు సంతానం పుట్టాక ఆమె అక్బర్‌ను, పిల్లల్ని వదిలేసి నంబూరుకే చెందిన ప్రేమ్‌కుమార్‌తో అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఏడేళ్లు గుంటూరులో కాపురం చేసింది.
ఈ క్రమంలోనే 2021లో రెహమాన్ అనే మరో వ్యక్తితో మల్లిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతని వద్ద బంగారం, డబ్బు కలిపి రూ.15 లక్షల వరకూ గుంజింది. కొంతకాలానికి నంబూరుకు చెందిన నాగబాబు అనే మరో వ్యక్తితో సహజీవనం చేసింది. ఇక్కడే రెహమాన్‌కు కోపం వచ్చింది. ఆమె తనకు మాత్రమే సొంతం కావాలనుకున్నాడు. మల్లిక మాత్రం పాస్ట్ ఈజ్ పాస్ట్ మళ్లీ నా గడప తొక్కొద్దంటూ తలుపులు మూసేసింది.
Pedakakani Woman Murder Case : ఈ విషయాన్ని రెహమాన్ తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా మల్లికను వశపరుచుకోవాలనుకుని దిల్లీకి చెందిన అహ్మద్ అనే భూత వైద్యుడిని రప్పించాడు. వశీకరణం కోసం ఆమె డ్రెస్, జుట్టు కూడా తెచ్చి అహ్మద్‌కు ఇచ్చాడు. గోధుమపిండితో రెండు బొమ్మలు చేసిన భూత వైద్యుడు వశీకరణ పూజ చేసినట్లు షో చేశాడు. కానీ మల్లిక మనసు మారలేదు. ఈ క్రమంలోనే అహ్మద్‌ను రెహమాన్ నిలదీశాడు. మల్లికను చంపేస్తానని, సహకరించాలని అహ్మద్‌ను అడిగాడు.
ఈ ప్లాన్‌లో తనకు పరిచయస్తులైన స్వప్నతోపాటు మరో వ్యక్తి సహకారాన్ని రెహమాన్ కోరాడు. అందరూ కలిసి ఈనెల 28న నంబూరులోని మల్లిక ఇంటి వద్దకు వెళ్లారు. స్వప్నను బయట కాపలాగా ఉంచారు. మిగతావాళ్లు లోపలికి వెళ్లి ఆమె గొంతుకు చున్నీ బిగించారు. మల్లిక ఊపిరి ఆగగానే అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు.
డెడ్ బాడీ పార్సిల్ కేసు : వర్మ ఇంట్లో మరో చెక్క పెట్టె, చేతబడి సామగ్రి