ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు పాత పేర్లు పునరుద్ధరణ - AP Irrigation Projects Name Changes - AP IRRIGATION PROJECTS NAME CHANGES

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 12:54 PM IST

AP Irrigation Projects Names Changes : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత సర్కార్ పెట్టిన వివిధ పథకాల పేర్లలో మార్పులు, చేర్పులు చేస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు అసలు పేర్లను పునరుద్ధరిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆయా ప్రాజెక్టులకు ఉన్న వాస్తవ పేర్లనే పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. వైఎస్సార్ సహా కొందరి వైఎస్సార్సీపీ నేతల పేర్లను జగన్ సర్కార్ వివిధ సాగునీటి ప్రాజెక్టులకు పెట్టింది. ఈ నేపథ్యంలో వాటి పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 

Names Changes of  Projects in AP : వైఎస్‌ఆర్‌ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టు పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. దీన్ని గోదావరి-పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా నిర్ధారిస్తూ ఉత్తర్వులిచ్చింది. అదేవిధంగా వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి దాని అసలు పేరు ముక్త్యాల ఎత్తిపోతల పథకంగా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 12 ప్రాజెక్టులకు వాటి అసలు పేర్లు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details