ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మందుబాబుల మందు చూపు- మద్యం దుకాణాల వద్ద బారులు! - Huge Crowd at Wine Shops - HUGE CROWD AT WINE SHOPS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 7:54 PM IST

Huge Crowd at Wine Shops: విశాఖలోని మద్యం దుకాణాల వద్ద మందు ప్రియులు బారులు తీరారు. ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో సోమవారం నుంచి బుధవారం వరకూ మద్యం దుకాణాలు మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు చేయకూడదని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి నుంచి మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. తిరిగి మళ్లీ 6వ తేదీన ఉదయం మద్యం దుకాణాలు తెరుచుకుంటాయి. ఫలితంగా మద్యం దుకాణాల వద్ద మందు బాబులు బారులు తీరారు. మద్యం సీసాలు విక్రయించి తమ ఇళ్ల వద్ద స్టాక్ పెట్టుకునేందుకు దుకాణాల వద్ద ఎగబడుతున్నారు. 

కాగా ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు  ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జూన్ 4 తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్​లు, హోం ఓటింగ్​కు సంబంధించిన ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. చీమ చిటుక్కుమన్నా సరే ఇట్టే పసిగట్టేలా మూడెంచల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details