ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికల సమయంలో అలర్లు, రీపోలింగ్ జరగకుండా చర్యలు: ముఖేష్‌ కుమార్‌ మీనా - Mukesh Kumar Meena Interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 19, 2024, 11:02 AM IST

Mukesh Kumar Meena Interview With Etv Bharat : ఏపీ ఎన్నికల్లో డబ్బు, మద్యం అక్రమ రవాణా, పంపిణీనీ అడ్డుకునేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా స్పష్టం చేశారు. మద్యం డిస్టిలరీల నుంచి ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ గోదాములకు, అక్కడి నుంచి రిటైల్‌ దుకాణాలకు సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్‌ ఉపకరణాలు పెడతామని అన్నారు. అదే సమయంలో మద్యం ఉత్పత్తి, విక్రయాలపైనా దృష్టి పెట్టామనీ చెప్పారు. ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులపై ఈసీ తాత్సారం చేస్తోందంటూ వస్తున్న ఆరోపణలు నిజం కావని ఆయన వెల్లడించారు. 

ఎన్నికల సమయంలో అలర్లు, ఎక్కడ కూడా రీ పోలీంగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ముఖేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఎక్కడైనా హింసాత్మక సంఘటనలు జరిగితే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులను, అలాగే గ్రామ వాలంటీర్లను సస్పెండ్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నామని అంటున్న మీనాతో ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details