LIVE: రాష్ట్రంలో ఓట్ల లెక్కింపుపై సీఈవో ముకేష్‌కుమార్ మీనా మీడియా సమావేశం - Mukesh Kumar Meena Media conference
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 3, 2024, 1:11 PM IST
|Updated : Jun 3, 2024, 1:46 PM IST
MUKESH KUMAR MEENA MEDIA CONFERENCE: ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. కౌంటింగ్‌కు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ క్షణాల కోసం అభ్యర్థులతోపాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగ కన్నేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత పెడితే మరికొన్ని చోట్ల ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. మరికొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మంగళవారం (జూన్ 4వ తేదీన) ఉదయం కౌంటింగ్ మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌంటింగ్ ఏర్పాట్లపై ముకేష్‌కుమార్ మీనా మాట్లాడుతున్నారు.
Last Updated : Jun 3, 2024, 1:46 PM IST