ఏపీ బెవరేజెస్ చోరీ కేసులో బెయిల్ మంజూరుకు వాసుదేవరెడ్డి హైకోర్టులో పిటిషన్ - APSBCL Former MD bail Petition - APSBCL FORMER MD BAIL PETITION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 13, 2024, 9:11 AM IST
AP Beverages Theft Case Bail Petition Filed in High Court : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెట్ చోరీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఆ సంస్థ మాజీ ఎండీ డి. వాసుదేవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీఎస్‌బీసీఎల్ (APSBCL) కార్యాలయంలో కీలక దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు చోరీ, ఆధారాల ధ్వంసం ఆరోపణలతో డి. వాసుదేవరెడ్డిపై సీఐడీ (CID) అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఆయన హై కోర్టును ఆక్రయించారు.
వేసవి సెలవుల ప్రత్యేక బెంచ్ నేడు ఈ వ్యాజ్యంపై విచారణ చేయనుంది. ఈ నెల 6న ( జూన్ 6న) ఏపీఎస్‌బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు చోరీచేసి తరలిస్తుండగా చూశానంటూ ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మెుగులూరుకు చెందిన శివకృష్ణ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అతని ఫిర్యాదు మేరకు మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్లో వాసుదేవరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసుపైనే ప్రత్యేక బెంచ్ ఇవాళ విచారణ చేయనున్నారు.