LIVE: ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - AP Assembly Sessions 2024 - AP ASSEMBLY SESSIONS 2024
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 24, 2024, 9:04 AM IST
|Updated : Jul 24, 2024, 1:34 PM IST
AP Assembly Sessions 2024 Live: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆబ్కారీ శాఖలో జరిగిన భారీ అక్రమాలు, అవినీతిపై నేడు శాసనసభలో ఉదయం పదకొండున్నర గంటలకు ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రకటించనుంది. అనంతరం సభలో రెండు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆరోగ్య వర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుపై మంత్రి సత్యకుమార్ చర్చ చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మద్యం అక్రమాలపై శ్వేతపత్రాన్ని శాసనసభ వేదికగా ప్రకటించనున్నారు. తొలుత ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లుని సభలో చర్చించి ఆమోదించనున్నారు. తర్వాత విజయవాడలో యూనివర్శిటీ ఆఫ్ హెల్త్‌సైన్సెస్‌కు ఎన్టీఆర్ పేరు తొలగించి, వైఎస్‌ఆర్ పేరు పెడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టసవరణ రద్దు చేసే బిల్లుపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో విశాఖలో కాలుష్య నియంత్రణ, రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులు, కేజీహెచ్‌లో పడకలు, సిబ్బంది కొరత, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ధాన్యం రైతుల సమస్యలు, టెంపుల్ టూరిజం, ఇసుక తవ్వకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మారిటైమ్ బోర్డు ద్వారా కృష్ణపట్నం పోర్టు లీజు, మత్యకారులకు జీవో 217 ఇబ్బందులపై ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Jul 24, 2024, 1:34 PM IST