ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : తొమ్మిదో రోజు ఏపీ శాసనసభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - AP ASSEMBLY SESSIONS LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2024, 9:16 AM IST

Updated : Nov 21, 2024, 5:24 PM IST

AP Assembly Sessions Live : తొమ్మిదో రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమ్యయాయి. ఎలక్ట్రానిక్ పాలసీ, డేటా సెంటర్ పాలసీలపై అసెంబ్లీలో మంత్రి లోకేశ్ ప్రకటన చేస్తున్నారు. డ్రోన్ పాలసీపై మంత్రి జనార్దన్‌రెడ్డి, పర్యాటక పాలసీపై మంత్రి దుర్గేష్, స్పోర్ట్ పాలసీపై మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రకటనలు చేయనున్నారు. రుషికొండపై అక్రమ నిర్మాణాలు, ఇటీవల వరదలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మంత్రివర్గంలో ఆమోదం పొందిన 6 బిల్లులను నేడు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.ల్యాండ్ గ్రాబింగ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సత్యప్రసాద్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును మంత్రి నారాయణ, జీఎస్టీ, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సవరణ బిల్లులను మంత్రి పయ్యావుల, దేవాదాయశాఖ సవరణ బిల్లును మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పెట్టుబడులు, మౌలిక సౌకర్యాల సవరణ బిల్లులను మంత్రి జనార్దన్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ అంశాలు, విద్యుత్ ఛార్జీలు, పుష్కర ఎత్తిపోతల పథకం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి నిధికి సంబంధించిన అంశం, తిరుపతి పట్టణాభివృద్ధి నిధులు తదితర అంశాలపై ప్రశ్నలకు మంత్రుల సమాధానం ఇవ్వనున్నారు. ఆన్‌లైన్‌ లోన్ యాప్‌లు, టిడ్కో గృహాలకు సంబంధించి, ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనంపై, ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్ పార్కు, విశాఖలో ఐటీ హబ్‌పై ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు.
Last Updated : Nov 21, 2024, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details