ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విద్యార్థుల ఆత్మహత్యపై సిట్టింగ్​ జడ్డితో విచారణ జరిపించాలి: విద్యార్థి సంఘాలు - Student Suicide - STUDENT SUICIDE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 7:13 PM IST

Annamacharya Engineering College Student Suicide in Rajampeta : అన్నమయ్య జిల్లా రాజంపేటలోని అన్నమాచార్య కళాశాల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సోమవారం ఆత్మహత్య చేసుకున్న రేణుక (20) అనే విద్యార్థిని మృతదేహానికి ఎలాంటి పంచనామా చేయకుండానే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాలేజీ యాజమాన్యం వేధింపులకు భరించలేక తమ కుమార్తె చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు రేణుక తల్లిదండ్రులకు మద్దతు తెలిపారు. కాలేజీ ఎదుట బైఠాయించి నిరసనలు తెలిపారు. విద్యార్థి సంఘాల వారిని కాలేజీలోకి అనుమతించకుండా గేట్లు మూసివేసి తాళాలు వేశారు. 

కళాశాల్లో విద్యార్థుల అనుమానాస్పద ఆత్మహత్యపై సిట్టింగ్​ జడ్డితో సమగ్ర విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల నేతలపై ఇంజనీరింగ్​ కళాశాల సిబ్బంది దాడి చేశారు. పోలీసుల కళ్లెదుటే దాడికి దిగినా పట్టించుకోవడం లేదని విద్యార్థుల సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని విద్యార్థుల సంఘాల నాయకులు సృష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details