ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అంగన్వాడీ కార్యకర్త మృతి- ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్న సర్పంచ్ - అంగన్వాడీ కార్యకర్త మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 4:59 PM IST

Anganwadi Worker Death in Alluri District: డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ అస్వస్థతకు గురై అంగ్వనాడీ కార్యకర్త మృతి చెందింది. స్థానికుల చేత కంటతడి పెట్టిస్తున్న ఈ ఘటన అల్లూరి జిల్లా దారెలలో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సౌభాగ్య (25) అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు, పింఛన్ సౌకర్యం కల్పించాలంటూ అంగన్వాడీలు చేస్తున్న ధర్నాలో  ఈనెల 13న పాల్గొన్న సౌభాగ్య అస్వస్థకు గురయ్యారు. వెంటనే తోటి కార్యకర్తలు అప్రమత్తమై సౌభాగ్యను ఆసుపత్రికి తరలించారు. విశాఖ కెజీహెచ్​లో చికిత్స పొందుతూ శుక్రవారం సౌభాగ్య మృతి చెందారు. 

తమ ఉద్యోగాల నుంచి ప్రభుత్వం ఎక్కడ తొలగిస్తుందో అని ఆందోళనకు గురై మరణించినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. సౌభాగ్య మృతికి జగన్ సర్కారే కారణమని సర్పంచ్ ఆరోపించారు. బాధితురాలి కుటుంబానికి 25 లక్షలు రూపాయలు, ఆమె కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని సర్పంచ్ డిమాండ్ చేశారు.  

ABOUT THE AUTHOR

...view details