LIVE: ఏపీ శాసన మండలి సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - andhra pradesh legislative council - ANDHRA PRADESH LEGISLATIVE COUNCIL
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 23, 2024, 10:24 AM IST
|Updated : Jul 23, 2024, 2:30 PM IST
AP LEGISLATIVE COUNCIL SESSIONS: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుతో పాటు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి NTR పేరు పునరుద్ధరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై అసెంబ్లీతో పాటు శాసనమండలిలోనూ చర్చించనున్నారు. శాసన మండలి సమావేశాల రెండో రోజు ప్రశ్నోత్తరాలు, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చించనున్నారు. ధన్యవాదాల తీర్మానంపై మండలిలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు చర్చను ప్రారంభించనున్నారు. పంచుమర్తి అనూరాధ తీర్మానాన్ని బలపరచనున్నారు. మండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పది ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. ఆర్థిక సంఘం గ్రాంట్ల మళ్లింపు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్ పథకం, జాతీయ రహదారి పనుల్లో అవకతవకలు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, టీటీడీలో అక్రమాలు, వైద్యారోగ్యం, పౌర సరఫరాల రుణాలు, ఫిషింగ్ హర్బర్లు, గనుల్లో అక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆరోగ్య శిబిరాల పై ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. శాసన మండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Jul 23, 2024, 2:30 PM IST