తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : భువనగిరి బీజేపీ సభలో అమిత్ షా - AMIT SHAH AT BHUVANAGIRI LIVE - AMIT SHAH AT BHUVANAGIRI LIVE

By ETV Bharat Telangana Team

Published : May 9, 2024, 12:19 PM IST

Updated : May 9, 2024, 12:52 PM IST

Amit Shah Public Meeting In Bhuvanagiri LIVE : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్​కు మద్దతుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ, రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తోందని అమిత్​షా ఆరోపించారు. ఫేక్‌ వీడియోను, ముఖ్యమంత్రి సైతం సర్క్యులేట్‌ చేశారంటూ తప్పుబట్టారు. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన అమిత్​షా ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసి, బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతామని పునరుద్ఘాటించారు. దేశ వ్యాప్తంగా నక్సలిజంను అంతం చేస్తున్నామని, ఛత్తీస్‌గఢ్‌లో కొద్ది ప్రాంతం మినహా అంతటా తుదముట్టించామని అమిత్‌షా పేర్కొన్నారు. మన్మోహన్‌ సమయంలో, ముస్లింల ఓట్ల కోసం ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ఏబీసీ అంటే అసదుద్దీన్‌ ఒవైసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలేనని వ్యాఖ్యానించారు. 
Last Updated : May 9, 2024, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details