'16 నెలలుగా జీతాల్లేవు ఎలా బతికేది' - వ్యవసాయ ఉద్యోగులు ధర్నా - Employees Protest For Salaries - EMPLOYEES PROTEST FOR SALARIES
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 22, 2024, 9:01 PM IST
Agriculture Employees Protest For Salaries Not Paid : వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత 16 నెలలుగా వేతనాలను ఇవ్వలేదని పెండింగులో ఉన్న వాటిని చెల్లించాలని నంద్యాలలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. నంద్యాలలోని బొమ్మలసత్రం నుంచి క్రాంతినగర్‌లో ఉన్న ఏపీసీఎన్ఎఫ్ కార్యాలయం వరకు ఉద్యోగులు ఈ ర్యాలీని నిర్వహించారు. అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్‌కు ఉద్యోగులు వినతిపత్రాన్ని ఇచ్చారు.
గుంటూరులో కూడా 16 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదని ప్రకృతి వ్యవసాయ ఒప్పంద సిబ్బంది కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సంవత్సరంపైగా వేతనాలు లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బకాయిలు విడుదల చేయాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. పదహారు నెలలుగా తమకు జీతాలు ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని వ్యయసాయ ఉద్యోగులు వాపోయారు.