తెలంగాణ

telangana

ETV Bharat / videos

భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు - పరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్ - FARMERS DEMAND COMPENSATION

By ETV Bharat Telangana Team

Published : Sep 11, 2024, 4:50 PM IST

Kamareddy Farmers Protest : కామారెడ్డి జిల్లాలోని  పెద్దకోడప్​​గల్​ మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలంటూ రైతుల నిరసన తెలిపారు. నష్టపోయిన పంటలను తక్షణమే అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మధ్య భారీగా కురిసిన వర్షాలు రైతులకు పెద్ద ఎత్తున నష్టాలు మిగిల్చాయి. వరద తాకిడి కొంత మంది పోలాల్లో ఇసుక మేటలు వేసింది. చాలా మంది రైతులు రూ.వేలకు వేలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇలా నష్టం రావడంతో తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వర్షాలతో మిర్చి రైతులకు కోలుకోలేని పరిస్థితి వచ్చిందని తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.  వరద తాకిడి పొలం నిండా పరచుకోవడంతో దిక్కుతోచని స్థితి నెలకొందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరదల నష్టం రూ. 5 వేల కోట్లకు పై చిలుకు ఉంటుందని సీఎం రేవంత్​ రెడ్డి పలుమార్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details