ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాజకీయ పార్టీలతో చెట్టపట్టాల్- ఏపీపీలను తొలగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు - Public Prosecutors Terminated - PUBLIC PROSECUTORS TERMINATED

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2024, 5:28 PM IST

Additional Public Prosecutors Terminated in Vijayawada Courts : విజయవాడలోని వివిధ న్యాయస్థానాల్లో పని చేస్తున్న అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను విధుల నుంచి తొలగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను తొలగిస్తూ వేరు వేరు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వారు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావటం కోడ్ నిబంధనల్ని ఉల్లంఘించారన్న అభియోగాల మేరకు తొలగిస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

దీంతో విజయవాడ ఏసీబీ కోర్టు సహా వివిధ సెషన్స్ కోర్టుల్లో పని చేస్తున్న అదనపు పీపీలను సైతం తక్షణం తొలగిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు ఇచ్చారు. పోక్సో చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్​ను కూడా ఈ అభియోగాలపై విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారిపై కోరడా విసురుతుంది.

ABOUT THE AUTHOR

...view details