బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఎస్బీఐ మొబైల్ స్క్రీనింగ్ బస్సు - ప్రారంభించిన బాలకృష్ణ - Actor Balakrishna On Cancer
Published : Jan 21, 2024, 7:05 PM IST
Actor Balakrishna Started Mobile Cancer Screening Bus : బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి ఎస్బీఐ అందించిన నూతన మొబైల్ స్క్రీనింగ్ బస్‌ను ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ సీజీఎం రాజేశ్ కుమార్ సహా బసవతారకం ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. రూ.1.5 కోట్ల విలువైన ఈ వ్యాన్‌లో అల్ట్రా మోడ్రన్ మామోగ్రఫీ, ఆల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే సిస్టం అందుబాటులో ఉన్నాయి.
Actor Balakrishna about Cancer Treatment : ఈ సందర్భంగా ఎస్బీఐ అందించిన మొబైల్ స్క్రీనింగ్ బస్‌ను ఆసుపత్రి ఛైర్మన్, నటుడు బాలకృష్ణ స్వయంగా నడపటం విశేషం. అనంతరం ఆయన మొబైల్ స్క్రీనింగ్ బస్ గురించి వివరించారు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయటం కంటే, ఆ వ్యాధి రాకుండా చూసుకోవటం ముఖ్యమని బాలకృష్ణ అన్నారు. క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాపాయం లేకుండా కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా క్యాన్సర్‌పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు.