తెలంగాణ

telangana

ETV Bharat / videos

మహిళకు సర్జరీ చేసిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ - MLA Operated On The Woman

By ETV Bharat Telangana Team

Published : Mar 6, 2024, 7:25 PM IST

Acchampet MLA Vamsikrishna Operated On The Woman : ప్రస్తుతం అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టిన వారిలో డాక్టర్లు కూడా ఉన్నారు. వారు ఎమ్మెల్యేలు అయినా వారి వృత్తిని మాత్రం మరిచిపోలేదు. తాజాగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఓ మహిళకు సర్జరీ చేసి మంచి మనసు చాటుకున్నాడు. గర్భసంచి సమస్యతో బాధపడుతున్న బాధితురాలికి నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆపరేషన్ చేశాడు. బాధిత మహిళ లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందింది. బాలమణి గత కొన్ని రోజుల నుంచి గర్భసంచి సమస్యతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే ఆర్థిక పరిస్థితి లేక అచ్చంపేట ఏరియా దవాఖానాలో చేరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రికి చేరుకొని బాధిత మహిళకు విజయవంతంగా గర్భసంచి సర్జరీ పూర్తి చేశారు. గతంలోనూ ఓ గర్భిణికి సర్జరీ చేసి తన వృత్తి ధర్మాన్ని చాటారు.  

MLA Dr.Chikkudu Vamshi Krishna : సర్జరీ విజయవంతం కావడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు, డాక్టర్ మహేష్, డాక్టర్ ప్రశాంత్, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. వంశీకృష్ణ ఎమ్మెల్యే కాకముందు సర్జన్‌గా మంచి పేరు ఉంది. ఆయన అచ్చంపేట, హైదరాబాద్​, కల్వకుర్తిలో ప్రాక్టీస్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details