ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అమలాపురంలో ఆబోతు వీరంగం - ఇద్దరికి స్వల్ప గాయాలు - Abotu Halchal - ABOTU HALCHAL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 7:18 PM IST

Abotu Halchal Ambedkar Konaseema district : అంబేడ్కర్​ కోనసీమ జిల్లాలో ఆబోతు వీరంగం సృష్టించింది. అమలాపురం పట్టణంలో స్వైర విహారం చేస్తూ స్థానికులను భ్రయభ్రాంతులకు గురిచేసింది. స్థానిక ఆర్టీసీ డిపోలోకి ప్రవేశించడం వల్ల ప్రయాణికులు ఆందోళన గురయ్యారు. ఆబోతు వీరంగంతో ప్రజలు భయపడుతూ పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులను గాయపరిచింది. స్వల్ప గాయాలైన వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి హుటాహుటిన బయలుదేరారు.

Ambedkar Konaseema district : పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎంతో సేపు శ్రమించినా ఆబోతును బంధించలేకపోయారు. చివరకు క్రేన్​ సహాయంతో ట్రాక్టర్​లోకి ఎక్కించారు. వీరంగం సృష్టించిన ఆబోతు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆబోతు వీరంగంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఆబోతు చూడడానికి స్థానికులు తరలివచ్చారు. దానితో సెల్ఫీలు దిగుతూ సోషల్​ మీడియాలో (Social media) పోస్ట్​ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details