ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'ఆరోగ్యశ్రీ కొత్త పథకం కాదు- బటన్‌ నొక్కటంలో ఆలస్యం ఎందుకు?' - Busireddy Narender Reddy Interview - BUSIREDDY NARENDER REDDY INTERVIEW

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 5:13 PM IST

Dr Busireddy Narender Reddy Interview on Aarogyasri Bills: ఆరోగ్య శ్రీ చికిత్సలకు సంబంధించి బిల్లులు ప్రభుత్వం 6 నెలల నుంచి బకాయిలు పడటంతో ఆసుపత్రుల నిర్వహణ ఇబ్బందిగా మారిందని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బూసిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. బిల్లుల చెల్లింపుపై పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా స్పందన లేని కారణంగానే కొన్ని సంఘాలు నోటీసులు ఇచ్చాయని చెప్పారు. 

మందులు, వైద్య ఉపకరణాలు పంపిణీ చేసిన వారి నుంచి ఆసుపత్రి యాజమాన్యాలపై ఒత్తిడి ఉందని తెలిపారు. ఒప్పందం ప్రకారం 45 రోజుల్లో బిల్లులు చెల్లించాలని డాక్టర్‌ బూసిరెడ్డి నరేందర్‌రెడ్డి తెలిపారు. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని అన్నారు.  ఆరోగ్యశ్రీ కొత్త పథకం కాదని, ఎన్నికల కోడ్‌ పరిధిలోకి రాదని నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాల నిధులతో పోలిస్తే ఆరోగ్య శ్రీ బకాయిలు చాలా తక్కువని, కానీ ఆరోగ్యశ్రీ బటన్‌ నొక్కటంలో ఆలస్యం ఎందుకంటోన్న నరేందర్‌రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details