ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రకాశం జిల్లాలో మహిళ దారుణ హత్య - నిద్రిస్తున్న సమయంలో ఊపిరాడకుండా చేసిన దుండగులు - Woman murdered in Prakasam district - WOMAN MURDERED IN PRAKASAM DISTRICT

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2024, 7:06 PM IST

Woman Murdered in Kothapatnam of Prakasam District : ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కొత్తపట్నంలో నివసిస్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, కొత్తపట్నంలో నాగేశ్వరమ్మ(77) అనే మహిళ స్థానికంగా కల్లు దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తుంది. ఎప్పటిలాగే వ్యాపారం అయిపోయాక దుకాణాన్ని ముసేసి నిన్న(శనివారం) రాత్రి పడుకోంది. అయితే ప్రతిరోజు ఉదయం 6 గంటలకే లేచి పనులు చేసుకునే నాగేశ్వరమ్మ ఈరోజు(ఆదివారం) ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో స్థానికులు ఇంటి తలుపులను బద్దలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా నాగేశ్వరమ్మ విగతజీవిగా కనిపించారు. భయందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్​తో పరిశీలించారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ, శనివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు తెలిపారు. అలాగే ఆమె చెవి కమ్మలు, చేతికి ఉన్న బంగారు గాజులను తీసుకుని పరారైనట్లు నిర్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details