ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎంపీ వంగా గీత వచ్చిన వెనక్కి తగ్గని మత్స్యకారులు- న్యాయం కోసమేనంటూ ఆందోళనలు - పైపులైన్లు తొలగించాలని ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 6:44 PM IST

4th Day Konapapet Fisherman Protest: గత మూడు రోజులుగా ఉద్ధృతంగా కొనసాగుతున్న మత్స్యకారుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. వందలాది మత్స్యకార కుటుంబాలు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపాయి. ఫార్మా కంపెనీ పైపులైన్లు తొలగించకపోతే ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని మత్స్యకారులు అధికారులను హెచ్చరించారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో మత్స్యకారులు నిరసనలు చేస్తున్న ప్రాంతానికి ఎంపీ వంగా గీత (Kakinada MP vanga Geetha) వచ్చి, కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి న్యాయం జరిగేలా చేస్తామని వంగా గీతా హామీ ఇచ్చారు. కమిటీ పెద్దలు యాజమాన్యంతో సోమవారం సానుకూల చర్చలు జరిపుతామని గీత వెల్లడించారు. అప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తామని మత్స్యకారులు స్పష్టం చేశారు. 

పరిశ్రమల నుంచి సముద్రంలోకి పైప్‌లైన్ వేయడం వల్ల కాలుష్య వ్యర్థాలతో  చేపల వృద్ధి తగ్గిపోతుందని, దీంతో చేపల ఉత్పత్తి తగ్గి ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. చేపల వేట సమయంలో బోట్లు, వలలు పైపులైన్లకు తగిలి దెబ్బతింటున్నాయని, దీని వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని అన్నారు. సముద్రంలోకి వేసిన కాలుష్య పరిశ్రమల పైపులైన్లు వెంటనే తొలగించాలని గత మూడు రోజులుగా నిరసనలు చేస్తున్న సంగతి విధితమే.

ABOUT THE AUTHOR

...view details