Nelapattu Bird Sanctuary In Tirupathi District: పక్షుల కిలకిలా రావాలతో నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం సందడిగా మారింది. ఆదివారం సెలవురోజు కావడంతో పాఠశాల విద్యార్థులు, కుటుంబ సభ్యులు విచ్చేసి చెరువుల్లో సేదతీరుతున్న విహంగాలను వీక్షించారు. ఐదేళ్ల అనంతరం నిర్వహిస్తున్న వేడుక కావడంతో రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి సైతం పర్యాటకులు తరలివచ్చారు.
గుంటూరు జిల్లా ఉప్పలపాడులో విదేశీ పక్షుల సందడి
ఫ్లెమింగో ఫెస్టివల్‌కు క్యూ కట్టిన సందర్శకులు: తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రెండో రోజు సందర్శకులు క్యూ కట్టారు. వలస పక్షులను వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేశారు. పర్యాటకుల కోసం అధికారులు అన్ని రకాల వసతులు కల్పించారు. నేలపట్టు చెరువు కట్టపై సందర్శకులకు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు వారికి సూచనలిస్తూ అప్రమత్తం చేసేలా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. వ్యూ పాయింట్ నుంచి పక్షులను తిలకించిన పర్యాటకులు వాటిని తమ ఫోన్లలో బంధించారు.
సంక్రాంతి తర్వాత మరో పండుగను తలపించేలా.. చెరువు కట్టపై పక్షులను వీక్షించిన అనంతరం పలువురు కుటుంసభ్యులతో కలసి పిల్లల పార్కుకు చేరుకుని సేదతీరారు. అక్కడున్న పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి అందులోని విశేషాలను గైడ్లను అడిగి తెలుసుకున్నారు. పార్కులోని క్రీడా పరికరాలతో చిన్నారులు ఆటలాడుతూ ఉల్లాసంగా గడిపారు. సమీపంలోని జింకల పార్కులోనూ సందర్శకులు సందడి చేశారు. సంక్రాంతి తర్వాత మరో పండుగను తలపించేలా ఫ్లెమింగో ఫెస్టివల్‌లో ఏర్పాట్లు చేశారంటూ పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు.
అరుదైన అందాలు - పక్షి ప్రేమికులకు పండగే
మార్కాపురానికి అనుకోని అతిథులు - సెల్ఫోన్లో బంధించిన ప్రజలు - Beautiful Birds in Markapuram Pond