ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తిని ఎందుకు గెలిపించాలి: అయ్యన్నపాత్రుడు - 3thousand members joining in tdp - 3THOUSAND MEMBERS JOINING IN TDP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 3:01 PM IST

3 Thosand Members Joined in TDP at Payakaravupeta: ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, సర్వనాశనం చేశారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన నీచమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వైఎస్సార్సీపీ నుంచి సుమారు 3 వేల మంది తెలుగుదేశంలోకి చేరారు. ఎలమంచిలి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాసరావు, పాయకరావుపేటకు చెందిన ఎంపీటీసీలు సర్పంచులు అయ్యన్న, వంగలపూడి అనిత సమక్షంలో చేరారు. 

రాష్ట్రంలో ఇసుక, మట్టి దోచుకుని అమ్ముకుంటున్న వ్యక్తికి తాము ఎందుకు భయం పడాలని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇలాంటి వ్యక్తికి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ఐదేళ్లలో రాష్ట్రం అప్పుల పాలై, కనీసం ఉపాధి కూలీలు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని అయ్యన్న కోరారు. 

ABOUT THE AUTHOR

...view details