హైదరాబాద్లోని బంజారాహిల్స్లో అగ్ని ప్రమాదం - తప్పిన ప్రాణ నష్టం - 3 Cars Gutted Fire In Banjara Hills
Published : Jan 20, 2024, 9:40 PM IST
Fire Accident In Banjara Hills : బంజారాహిల్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 4లో ఉన్న ఓ ప్రైవేట్ హోటల్ పార్కింగ్ ప్లేస్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులకు సమాచారం అందించగా వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4 లో సరిత రెసిడెన్సీలో ఫైర్ యాక్సిడెంట్ అయిందని డయల్ 100కు సమాచారం వచ్చిందని జూబ్లీహిల్స్ ఫైర్ ఇన్స్పెక్టర్ సాయి తెలిపారు. వెంటనే రెండు ఫైర్ ఇంజన్లతో, సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకున్నారు. పార్కింగ్ ప్లేస్లో ఉన్న కారును డ్రైవర్ స్టార్ట్ చేస్తుండగా స్పార్క్ వచ్చి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
3 Cars Gutted In Fire At Sarita Residence In Banjara Hills : ప్రమాదంలో పక్కనే పార్క్ చేసి ఉన్న రెండు కార్లకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి మూడు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కార్ల మంటలు పక్కనే ఉన్న సరిత రెసిడెన్సీ రెండో అంతస్తు వరకు ఎగసిపడ్డాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.