ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నున్నలో యువతి అనుమానాస్పద మృతి - WOMAN SUSPICIOUS DEATH IN NUNNA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 12, 2024, 10:09 AM IST

20_years_woman_died_after_jumping_from_an_apartment (ETV Bharat)

20 Years Woman Suicide in Nunna Vijayawada : విజయవాడ నగర శివారు నున్న పవర్‌ గ్రిడ్‌ కూడలిలోని ఓ అపార్ట్​మెంట్​ పైనుంచి దూకి యువతి అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. మృతురాలు కండ్రికకు చెందిన హైమావతిగా గుర్తించారు. ఐదు అంతస్తులపై నుంచి దూకటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నున్న గ్రామీణ పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమస్య ఏదైనా చావే పరిష్కారం అనుకుంటూ కొందరు నూరెళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల ఇటువంటి ఘటనలు సర్వసాధారణమవుతున్నాయి. ఆలోచించకుండా వారు తీసుకునే నిర్ణయం వల్ల కొన్ని సందర్భాల్లో ఆ కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంటున్న దంపతులు అకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. నెల్లూరులో ఆదివారం జరిగిన ఈ ఘటన వారి పిల్లలను అనాథలను చేసింది. అనాలోచితంగా వారు చేసిన పనికి ముక్కుపచ్చలారని పిల్లలు అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details