తెలంగాణ

telangana

ETV Bharat / videos

అయోధ్య బాలరాముడికి బహుబలి కానుకలు - 1600 కేజీల గద, 1100కిలోల ధనుస్సు - 1600 KG Gada To Ayodhya Ram Mandir

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 12:51 PM IST

1600 KG Gada To Ayodhya Ram Mandir : అయోధ్య బాలరాముడికి ఇంకా కానుకలు వస్తూనే ఉన్నాయి. తాజాగా 1600 కిలోల గద, 1100 కిలోల రామ్​ ధనుస్సును రాజస్థాన్​కు చెందిన సుమేర్​పుర్ శ్రీజీ సనాతన్ సేవా సంస్థ కానుకగా ఇవ్వనుంది. జూన్​ 12న అయోధ్యకు బయలు దేరిన ఈ కానుకలు జూన్​ 16న రామమందిరానికి చేరుకుంటాయి. జూన్​ 17న ప్రత్యేక పూజలు చేసి బాలరాముడి సమర్పించునున్నారు. ఈ భారీ గదను 26 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పుతో రూపొందించారు. రామ్​ ధనుస్సును 31 అడుగుల ఎత్తుతో 5 లోహలతో కలిపి తయారు చేశారు. మొత్తం 24 మందికి పైగా కళాకారులు కలిసి వీటిని రూపొందించిన్నట్లు శ్రీజీ సనాతన్ సేవా సంస్థ పేర్కొంది. శ్రీరామ నవమి రోజు నుంచి తయారు చేయడం ప్రారంభించామని తెలిపింది.  

హనుమాన్​కు 700 కిలోల గద
700 KG Gada to Ghazipur Hanuman temple : ఉత్తర్​ప్రదేశ్​లోని గాజిపుర్ హనుమాన్​కు 700 కిలోల భారీ గదను కానుకగా ఇచ్చారు. రాయబరేలీలోని మహారాజ్​గంజ్​కు చెందిన రామ్​ కుమార్ యాదవ్ గదను ఇస్తున్నారు. మొత్తం 18 మంది కళాకారులతో 45 రోజలు పాటు శ్రమించి 22 అడుగుల ఎత్తులో దీనిని రూపొందించారు. జూన్​ 16 సాయంత్రం హనుమాన్ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద ప్రతిష్ఠాపన చేయనున్నారు.  

ABOUT THE AUTHOR

...view details