ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖలో 12 అడుగుల కొండచిలువ కలకలం - పట్టుకుని అడవిలో వదిలిపెట్టిన స్నేక్‌ కేచర్‌ - 12 feet python in Visakha

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2024, 9:04 PM IST

12 feet python near ACB office in Visakha: విశాఖలోని ఏసీబీ కార్యాలయ సమీపంలో కొండచిలువ కలకలం సృష్టించింది. జీవీఎంసీ జోన్‌-2 పరిధిలోని 9వ వార్డు ఆదర్శనగర్‌ ప్రాంతంలో పంప్‌ హౌస్‌ ఉంది. ఇవాళ మధ్యాహ్నం పంప్‌ హౌస్‌ నుంచి నీటిని విడుదల చేసేందుకు అక్కడి ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌ కిందకు దిగాడు. సుమారు 12 అడుగుల కొండచిలువ అక్కడ కనిపించడంతో బెంబేలెత్తిపోయాడు. అప్రమత్తమైన సిబ్బంది నరేష్‌ను పైకి లాగి అనంతరం స్నేక్‌ కేచర్‌ కిరణ్‌కు సమాచారమిచ్చారు. కిరణ్‌ అక్కడకు చేరుకుని పామును పట్టుకుని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నగరం నడిబొడ్డున అంతపెద్ద పాము కనిపించడంతో సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పామును పట్టుకున్న కిరణ్‌ను అక్కడి వారంతా అభినందించారు. ఎవరికైనా పాములు కనపడితే భయంతో వాటిపై దాడి చేయకుండా తనకు సమాచారం అందిస్తే జన సంచారానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పామును సురక్షిత ప్రాంతాలకు చేరుస్తానని కిరణ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details